‘తేనెటీగ రామారావు’ కన్నుమూత

ABN , Publish Date - May 05 , 2025 | 05:00 AM

నిర్మాత జవాజి వెంకట రామారావు అలియాస్‌ తేనెటీగ రామారావు(68) ఆదివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. కొంతకాలంగా లివర్‌ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు...

నిర్మాత జవాజి వెంకట రామారావు అలియాస్‌ తేనెటీగ రామారావు(68) ఆదివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. కొంతకాలంగా లివర్‌ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజేంద్రప్రసాద్‌తో ‘తేనెటీగ’, వంశీ దర్శకత్వంలో నరేశ్‌-వాణీ విశ్వనాథ్‌తో ‘ప్రేమ అండ్‌ కో’, శివకృష్ణతో ‘బొబ్బిలివేట’, ‘బడి’ వంటి చిత్రాలను నిర్మించడంతో పాటు పలు డబ్బింగ్‌ సినిమాలకు రామారావు నిర్మాతగా వ్యవహరించారు.

Updated Date - May 05 , 2025 | 05:00 AM