Imanvi Ismail Statement: భారతీయత నా రక్తంలోనే ఉంది
ABN , Publish Date - Apr 25 , 2025 | 06:28 AM
‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీ ఇస్మాయిల్ తన కుటుంబ నేపథ్యంపై వస్తున్న అన్యాయమైన ఆరోపణలను ఖండించారు. ఆమె పాకిస్థాన్ నుంచి కాకుండా భారతీయ అమెరికన్‌గా, భారతీయ సంస్కృతి తమ రక్తంలో ఉన్నట్టు స్పష్టం చేశారు

ఇమాన్వీ
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీ ఇస్మాయిల్ కుటుంబం పాకిస్థాన్‌కు చెందినదని, ఆమె తండ్రి గతంలో పాకిస్థాన్ సైన్యంలో పనిచేశారని, ఇమాన్వీని ‘ఫౌజీ’ నుంచి తొలగించాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇమాన్వీ స్పందించారు. తాను పాకిస్థాన్ అమ్మాయిని కాదంటూ సుదీర్ఘ వివరణను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘నా పైనా, నా కుటుంబ నేపథ్యంపైనా జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించాలనుకుంటున్నాను. మా కుటుంబంలో ఏ ఒక్కరికీ పాకిస్థాన్ సైన్యంతో ఎలాంటి సంబంఽధం లేరు. మీడియా నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం నన్ను నిరుత్సాహానికి గురిచేసింది. నేను ఇండియన్ అమెరికన్‌ని అని గర్వంగా చెబుతున్నా. హిందీ, తెలుగు, గుజరాతి, ఆంగ్ల భాషలు మాట్లాడగలను. లాస్ ఏంజెల్స్‌లో జన్మించాను. మా తల్లిదండ్రులు ఆమెరికాకు వలస వచ్చారు. అక్కడే యూనివర్శిటీ విద్యను పూర్తి చేశాను. నటిగా, కొరియోగ్రాఫర్‌గా, డ్యాన్సర్‌గా రాణిస్తున్నాను. ఈ రంగంలో చాలా కాలం పనిచేసిన తర్వాత భారత చిత్ర పరిశ్రమలో అవకాశాలు రావడం గర్వంగా భావిస్తున్నాను. సినిమా నా వ్యక్తిత్వంపై గొప్ప ప్రభావం చూపించింది. భారతీయత, భారత సంస్కృతి నా రక్తంలోనే ఉంది. సోషల్ మీడియాను మంచి కోసం ఉపయోగించండి’ అని ఇమాన్వీ పేర్కొన్నారు.