ప్రేక్షకులను ఆకట్టుకునేలా
ABN , Publish Date - May 14 , 2025 | 05:40 AM
సిద్ధార్థ్ హీరోగా శ్రీ గణేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం త్రీబీహెచ్‌కే. అరుణ్ విశ్వశాంతి నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్, దేవయాని, యోగిబాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు...
సిద్ధార్థ్ హీరోగా శ్రీ గణేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం త్రీబీహెచ్‌కే. అరుణ్ విశ్వశాంతి నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్, దేవయాని, యోగిబాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మంగళవారం చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించింది. జూలై 4న విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నిర్మాణంలో ఉన్న ఇంట్లో సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని తమ కుటుంబంతో ఆనందకర క్షణాలను ఆస్వాదిస్తూ కనిపించారు. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించామని మేకర్స్ తెలిపారు.