అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది
ABN , Publish Date - Feb 24 , 2025 | 05:34 AM
సందీప్ కిషన్, రీతూ వర్మ, అన్షు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మజాకా’. త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో రాజేశ్ దండా, ఉమేశ్ కెఆర్ బన్సల్ నిర్మించారు. ఈనెల 26న విడుదలవుతోంది...
సందీప్ కిషన్, రీతూ వర్మ, అన్షు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మజాకా’. త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో రాజేశ్ దండా, ఉమేశ్ కెఆర్ బన్సల్ నిర్మించారు. ఈనెల 26న విడుదలవుతోంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో హిరో సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘నా కెరీర్‌లో హయ్యస్ట్ నెంబర్స్‌ని ఈ సినిమా ఇస్తుంది. థియేటర్‌లో కుటుంబసమేతంగా చూసే చిత్రమిది. రావు రమేశ్ అద్భుతంగా నటించారు. ఆయన వల్ల కథ మరింత పండింది’ అని చెప్పారు. చిత్ర దర్శకుడు త్రినాఽథరావు మాట్లాడుతూ ‘నేను ప్రతి సీన్‌లో మ్యాజిక్ ఉండాలని నమ్ముతాను. నా ప్రతి సినిమాలో కూడా మ్యాజిక్ జరుగుతుంది. ఇందులో కూడా ఓ మ్యాజిక్ ఉంది. శివరాత్రి నాడు డబుల్ మ్యాజిక్ జరుగుతుంది. డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుంది’ అని తెలిపారు. రావు రమేశ్ మాట్లాడుతూ ‘ఇలాంటి సినిమా చేయడం నాకు కొత్తే. ఇందులో రొమాంటిక్‌గా నటించడం చాలా సవాల్‌గా అనిపించింది. ఒక ఎమోషనల్ సీన్ ఉంది.
అది ఐకానిక్‌గా నిలిచిపోతుంది’ అని అన్నారు. హీరోయిన్ రీతూ వర్మ మాట్లాడుతూ ‘ఈ సినిమాని ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు. నిర్మాత రాజేశ్ దండా మాట్లాడుతూ‘ ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది. రీతు వర్మ డ్యాన్స్ అదరగొట్టింది’ అని అన్నారు.
Read More Business News and Latest Telugu News