మంచి అనుభూతినిస్తుంది
ABN , Publish Date - Jun 02 , 2025 | 04:17 AM
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి జంటగా పృథ్వీ పెరిచెర్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘స్కై’. నాగిరెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీ లక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు నిర్మిస్తున్నారు...
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి జంటగా పృథ్వీ పెరిచెర్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘స్కై’. నాగిరెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీ లక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు నిర్మిస్తున్నారు. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో టీజర్‌ని లాంచ్ చేశారు. హీరోయిన్ శృతి శెట్టి మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. త్వరలోనే మీ ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని అన్నారు. హీరో, నిర్మాత మురళీ కృష్ణంరాజు మాట్లాడుతూ ‘నన్ను నేను హీరోగా కంటే ఒక నటుడిగా భావిస్తా. అనుభవజ్ఞులతో కలసి పనిచేయడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం మంచి అనుభూనిస్తుంది’ అని అన్నారు.