Rahul Vijay New Movie: ఏదో జరిగినే యెద లోపలా
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:13 AM
‘ఖేల్ ఖతమ్ దర్వాజ బంద్’ చిత్రం నుంచి ‘ఏదో ఏదో’ పాటను విడుదల చేశారు. ఈ ప్రేమభరిత గీతం సురేశ్ బొబ్బిలి స్వరపరిచి, కార్తీక్–హరిణి ఆలపించారు
రాహుల్ విజయ్, నేహా పాండే జంటగా అశోక్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఖేల్ ఖతమ్ దర్వాజ బంద్’. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అర్జున్ దాస్యన్ నిర్మించారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా నుంచి ‘ఏదో ఏదో..’ అనే పాటను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. పూర్ణాచారి సాహిత్యానికి సురేశ్ బొబ్బిలి సంగీతం సమకూర్చారు. కార్తీక్, హరిణి ఆలపించారు. ‘ఏదో ఏదో ఏదో జరిగెనే యెద లోపలా, ఏవో ఏవో కలలు విరిసినే, నిన్నా మొన్నా లేదే..’ అంటూ ఆకట్టుకునేలా సాగతుందీ పాట.