యాక్షన్‌ హంగామా

ABN , Publish Date - May 05 , 2025 | 05:12 AM

దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం పట్టాలెక్కింది. నహాస్‌ హిదాయత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘ఐ యామ్‌ గేమ్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దుల్కర్‌ సల్మాన్‌ నిర్మిస్తున్నారు...

దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం పట్టాలెక్కింది. నహాస్‌ హిదాయత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘ఐ యామ్‌ గేమ్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దుల్కర్‌ సల్మాన్‌ నిర్మిస్తున్నారు. ఆదివారం తిరువనంతపురంలో పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ ప్రారంభించారు. కథానాయకుడిగా దుల్కర్‌కు ఇది 40వ చిత్ర ం. ఆంటోనీ వర్గీస్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంతో తమిళ దర్శకుడు మిస్కిన్‌ నటుడిగా మలయాళ సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. ‘దుల్కర్‌ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న మలయాళ చిత్రమిది. ఇందులో ఆయన యాక్షన్‌ హంగామాను చూడబోతున్నారు. తిరువనంతపురంలో తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ కొనసాగుతుంది. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్‌ బిజోయ్‌, సినిమాటోగ్రఫీ: జిమ్షీ ఖలీద్‌.

Updated Date - May 05 , 2025 | 05:12 AM