Dude: ‘డ్యూడ్’ ఫస్ట్ సింగిల్.. ఏమిటో మాయ చేస్తోంది

ABN, Publish Date - Jan 09 , 2025 | 11:01 PM

రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘డ్యూడ్’ మూవీ ఫస్ట్ సింగిల్ తెలుగు, కన్నడ భాషలలో మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు, హీరో తేజ్ తన సంతోషాన్ని తెలియజేశారు. తాజాగా ఈ మూవీ విశేషాలను టీమ్ వెల్లడించింది.

Dude Movie Stills

యంగ్ హీరో తేజ్ నటిస్తూ కన్నడ-తెలుగు భాషల్లో దర్శకత్వం వహిస్తున్న వినూత్న ద్విభాషా చిత్రం ‘డ్యూడ్’. ఫుట్ బాల్ నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో సాగే ఈ చిత్రాన్ని ఫుట్ బాల్ ప్రేమికుడైన దివంగత నటుడు, కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్‌కు అంకితం చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన ‘ఏమిటో మాయ మంత్రమే... మది జింకలా పరిగెత్తేనే’ పాట అటు కన్నడలో, ఇటు తెలుగులో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగులో ఎస్.పి. మనోహర్ రాసిన ఈ గీతాన్ని అభిషేక్ ఆలపించారు. ఎమిల్ మహమ్మద్ ఈ చిత్రానికి సంగీత సారధి.


Also Read-King Nagarjuna: సీఎం రేవంత్ ఆదేశించారు.. కింగ్ నాగ్ పాటించారు

రంగాయన రఘు ఫుట్ బాల్ కోచ్‌గా ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లుగా మేకర్స్ తెలిపారు. సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూన్ లేదా జూలైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘డ్యూడ్’ నుంచి విడుదలైన తొలి గీతానికి అటు కన్నడతో పాటు ఇటు తెలుగులో లభిస్తున్న స్పందనకు చిత్ర కథానాయకుడు కమ్ దర్శకుడు తేజ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.


ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న రాఘవేంద్ర రాజ్ కుమార్... ఈ చిత్రానికి స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా కూడా వ్యవహరిస్తుడడం విశేషం. శాన్య కావేరమ్మ, మేఘ, మోహిత, ధృతి, అనర్ఘ్య, దిపాలి పాండే, సిరి, ఎవాంజిలిన్, సోను తీర్ధ గౌడ్, యశశ్విని, మెర్సి, మోనిష, రాజేశ్వరి వంటి వారంతా వివిధ రంగాలకు చెంది, ఫుట్ బాల్ అంటే పడి చచ్చే ధీర వనితలుగా ఇందులో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సుందర్ రాజా, స్పర్శ రేఖ, విజయ్ చెందూర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. పనోరమిక్ స్టూడియోస్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘జింకే మారి’ ఫేమ్ ఎమిల్ మహమ్మద్ సంగీతం సమకూర్చుతుండగా.. ‘అలా మొదలైంది’ ఫేమ్ ప్రేమ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.


Also Read-Game Changer: ‘గేమ్ చేంజర్’కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఎవరూ ఊహించి ఉండరు కదా..

Also Read-Ajith Kumar: రేసింగ్ సర్క్యూట్‌లో అజిత్ కారుకు ఘోర ప్రమాదం.. నుజ్జునుజ్జయిన కారు

Also Read-Yearender 2024 ఆర్టికల్స్..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 09 , 2025 | 11:01 PM