Dr Rental Jayadev: సినీ గ్రంథానికి దక్కిన గౌరవం
ABN , Publish Date - May 30 , 2025 | 05:36 AM
సీనియర్ జర్నలిస్టు, ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది అవార్డు గ్రహీత అయిన డాక్టర్ రెంటాల జయదేవను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘గద్దర్ ఫిల్మ్ అవార్డు’ వరించింది. మరుగున పడిపోయిన భారతీయ సినీమా విశేషాలను ఆయన 'తెలుగు సినిమా ఫస్ట్ రీల్' పుస్తకంలో పొందుపరిచారు.
సీనియర్ జర్నలిస్టు, ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది అవార్డు గ్రహీత అయిన డాక్టర్ రెంటాల జయదేవను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘గద్దర్ ఫిల్మ్ అవార్డు’ వరించింది. మరుగున పడిపోయిన భారతీయ సినీ చరిత్రలోని అనేక అంశాలను తవ్వితీసి, ఆయన రచించిన ‘మన సినిమా.. ఫస్ట్ రీల్’ పుస్తకం 2024వ సంవత్సరానికి గాను ‘ఉత్తమ సినీ గ్రంథం’గా ఎంపికైంది. దక్షిణ భారతీయ భాషా చిత్రాల తొలి అడుగుల చరిత్రపై జయదేవ పాతికేళ్ల పరిశోధనా పరిశ్రమకు ప్రతిఫలం ఈ పుస్తకం. హిందీతో సహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో వచ్చిన తొట్టతొలి టాకీలకు సంబంధించిన అనేక చారిత్రక సత్యాలను ఈ పుస్తకంలో జయదేవ అందించారు.