అలరించే ప్రేమగీతం

ABN, Publish Date - Apr 19 , 2025 | 03:30 AM

పాతతరం గ్రామీణ ప్రేమకథ నేపథ్యంలో అల్లుకున్న ఓ ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘దూరదర్శని’. ‘కలిపింది ఇద్దరినీ’ అనేది ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకుడు....

పాతతరం గ్రామీణ ప్రేమకథ నేపథ్యంలో అల్లుకున్న ఓ ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘దూరదర్శని’. ‘కలిపింది ఇద్దరినీ’ అనేది ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకుడు. బి. సాయిప్రతా్‌పరెడ్డి, జయశంకర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. హీరో హీరోయిన్లపై రూపొందించిన ప్రేమగీతాన్ని దర్శకుడు సుకుమార్‌ చేతుల మీదుగా చిత్రబృందం విడుదల చేసింది. సురేశ్‌ బనిశెట్టి సాహిత్యం అందించగా, ఆనంద్‌ గుర్రాన బాణీలు సమకూర్చారు. సింధుజ, శ్రీనివాసన్‌ ఆలపించారు. తొంభైల నాటి కాలానికి ప్రేక్షకులను తీసుకెళ్లి, నాటి ప్రేమకథలను గుర్తుకు తెచ్చేలా ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు చెప్పారు. చాలా పరిశోధన చేసి రూపొందించిన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని నిర్మాతలు తెలిపారు.

Updated Date - Apr 19 , 2025 | 03:30 AM