మెప్పించే ప్రేమకథా చిత్రం
ABN, Publish Date - May 04 , 2025 | 03:11 AM
‘మల్లేశం, 8ఏ.ఎం. మెట్రో’ లాంటి విభిన్న చిత్రాలను రూపొందించిన దర్శకుడు రాజ్ ఆర్. ఆయన దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం ‘23’. నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన...
‘మల్లేశం, 8ఏ.ఎం. మెట్రో’ లాంటి విభిన్న చిత్రాలను రూపొందించిన దర్శకుడు రాజ్ ఆర్. ఆయన దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం ‘23’. నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రాలతో తన ప్రతిభను నిరూపించుకున్న రాజ్ ఆర్ మంచి కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. వెంకట్ సిద్దారెడ్డి సహ నిర్మాతగా స్టూడియో 99 పతాకంపై నిర్మించారు. తేజ, తన్మయి జంటగా నటించగా, ఝాన్సీ, తాగుబోతు రమేశ్, ప్రణీత్ కీలకపాత్రలు పోషించారు. చిత్రబృందం శనివారం విడుదల తేదీని ప్రకటించింది. ఈ నెల 16న ‘23’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించే సున్నితమైన ప్రేమకథా చిత్రం ఇదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి.