ప్రేమలో కొత్త కోణాన్ని స్పృశిస్తూ
ABN, Publish Date - May 01 , 2025 | 06:00 AM
యువతీ యువకుల ప్రేమలో కొత్త కోణాన్ని స్పృశిస్తూ దర్శకుడు భాను ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. జూన్‌లో ఈ చిత్రాన్ని...
యువతీ యువకుల ప్రేమలో కొత్త కోణాన్ని స్పృశిస్తూ దర్శకుడు భాను ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. జూన్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాణసంస్థ ఐబీఎం ప్రొడక్షన్స్ పేర్కొంది. నిర్మాత కనకదుర్గారావు పప్పుల మాట్లాడుతూ ‘ఇప్పటివరకూ సందేశం, సామాజిక స్పృహతో సినిమాలు చేసిన దర్శకుడు భాను తొలిసారి ఓ స్వచ్ఛమైన ప్రేమకథతో ఈ చిత్రాన్ని తెరకెకి ్కంచాడు’ అని తెలిపారు. ‘ప్రథమార్థం అంతా వినోదాత్మకంగా, ఉల్లాసంగా నడుస్తుంది, ద్వితీయార్థంలో పతాక సన్నివేశాల్లో భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి’ అని దర్శకుడు తెలిపారు.