శర్వా సినిమాలో డింపుల్ హయాతి
ABN, Publish Date - Apr 29 , 2025 | 04:17 AM
శర్వానంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘శర్వా 38’ అనేది వర్కింగ్ టైటిల్. కేకే రాధామోహన్...
శర్వానంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘శర్వా 38’ అనేది వర్కింగ్ టైటిల్. కేకే రాధామోహన్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉందీ చిత్రం. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది. 1960ల కాలంలో ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇది. ఇందులో శర్వా సరసన అనుపమ పరమేశ్వరన్ నటించనున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో డింపుల్ హయాతి ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.