పవన్‌తో ఏకీభవిస్తున్నా

ABN , Publish Date - May 28 , 2025 | 04:28 AM

‘సగటు సినిమా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేసిన సూచనలతో నేను ఏకీభవిస్తున్నాను. సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలను...

‘సగటు సినిమా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేసిన సూచనలతో నేను ఏకీభవిస్తున్నాను. సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న వారి అభిప్రాయం అభినందనీయం. దీనిని మనమందరం స్వాగతించి, కలసికట్టుగా ముందుకు సాగుదాం’ అని నిర్మాత దిల్‌ రాజు అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా కాకుండా ఫిల్మ్‌ చాంబర్‌ ద్వారా మాత్రమే సంప్రదించాలనే సూచన పరిశ్రమకు శాశ్వత దిశ ఇస్తుంది. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ప్రభుత్వాలతో కలసి ముందుకు సాగాలి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సూచించిన అన్ని అంశాలపై తెలంగాణ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపి, తెలుగు సినిమా అభివృద్ధికి నిర్మాతల మండలితో కలసి కృషి చేస్తాం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - May 28 , 2025 | 04:28 AM