‘లోర్వెన్ ఏఐ’ స్టూడియోను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాలి
ABN, Publish Date - May 04 , 2025 | 03:19 AM
‘‘మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త సాంకేతికతను సినీ పరిశ్రమకు పరిచయం చేయాలనే దృఢ సంకల్పంతో దిల్‌రాజు ‘లోర్వెన్ ఏఐ’ స్టూడియోను లాంఛ్ చేయడం అభినందనీయం. దీనిని...
‘‘మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త సాంకేతికతను సినీ పరిశ్రమకు పరిచయం చేయాలనే దృఢ సంకల్పంతో దిల్‌రాజు ‘లోర్వెన్ ఏఐ’ స్టూడియోను లాంఛ్ చేయడం అభినందనీయం. దీనిని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు. నిర్మాత దిల్‌రాజు లాంఛ్ చేసిన ‘లోర్వెన్ ఏఐ’ స్టూడియోను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ఈ టెక్నాలజీని మూవీతో బ్లెండ్ చేయడమనేది వినోద రంగంలో సరికొత్త అడుగు. హాలీవుడ్‌కి దీటుగా హైదరాబాద్ ఎదుగుతోంది. కొత్త సాంకేతిక వల్ల ఉద్యోగావకాశాలు పుష్కలంగా లభ్యమవుతాయి’’ అని అన్నారు. ‘‘సినిమాల్లో ఈ సాంకేతికతని ఉపయోగించడం ద్వారా ముఖ్యంగా మూడు సౌలభ్యాలు ఉన్నాయి. మొదటిది విజయావకాశాల్ని పెంచుకోవచ్చు. రెండోది, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్‌లో సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. మూడోది, దీని వల్ల దర్శకులకు సమయం, నిర్మాతలకి డబ్బు మిగులుతుంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చేలా అభివృద్ధి చేస్తున్నాం’’ అని నిర్మాత దిల్‌రాజు చెప్పారు. ‘‘దిల్‌రాజు ప్రతీ విషయంలో ముందంజలో ఉంటారు. ఇప్పుడు అదే క్రమంలో పరిశ్రమలోకి ఏఐను ప్రవేశపెట్టడంలో ముందడుగు వేశారు’’ అని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. ‘‘ఈ కంపెనీ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అని దర్శకుడు రాఘవేంద్రరావు అన్నారు. ‘‘ఈ సాంకేతికత గురించి దిల్‌రాజు ఇచ్చిన ప్రజంటేషన్ చూశాను. అదిరిపోయింది’’ అని దర్శకుడు సుకుమార్ పేర్కొన్నారు. ‘‘ఈ ప్రాజెక్ట్‌లో దిల్‌రాజు ప్యాషన్ కనిపిస్తోంది. ఈ సాంకేతికతను ఉపయోగించడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నాను’’ అని దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పారు.
‘‘ఇది సినీ పరిశ్రమకు ఎంతో ఉపయోగపడుతుంది’’ అని మరో దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. ‘‘ఈ కంపెనీ పెద్ద విజయవంతం కావాలని కోరుకుంటున్నాను’’ అని దర్శకుడు బాబీ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి అధ్యక్షుడు కే.ఎల్.దామోదర ప్రసాద్, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, సాహు గారపాటి, దర్శకులు వి.వి. వినాయక్, మోహన్‌కృష్ణ ఇంద్రగంటి, వంశీ పైడిపల్లి తదితరులు పాల్గొన్నారు.