ప్రతిభ కలిగిన వారికోసం దిల్‌రాజు డ్రీమ్స్‌

ABN , Publish Date - May 22 , 2025 | 06:12 AM

తన మొదటి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న దిల్‌రాజు ఇప్పటివరకూ ఎంతో మంది కొత్త దర్శకులను, సాంకేతిక నిపుణులను పరిశ్రమకు పరిచయం చేశారు. తాజాగా ఆయన మరో అడుగు...

తన మొదటి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న దిల్‌రాజు ఇప్పటివరకూ ఎంతో మంది కొత్త దర్శకులను, సాంకేతిక నిపుణులను పరిశ్రమకు పరిచయం చేశారు. తాజాగా ఆయన మరో అడుగు ముందుకు వేసి తెలుగు చిత్ర పరిశ్రమకు మరింత మంది ప్రతిభ కలిగిన వారిని పరిచయం చేయడం కోసం ఏకంగా ‘దిల్‌రాజు డ్రీమ్స్‌’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా యువ ప్రతిభావంతులకు మంచి అవకాశాలు కల్పించాలని నిర్ణయించుకున్నారు. జూన్‌ నుంచి ఆయన సిద్ధం చేసిన ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌ యాక్టివ్‌ అవుతుంది. ఈ సంస్థ వెబ్‌సైట్‌లో యువ ప్రతిభావంతులు తమ వివరాలను నమోదు చేస్తే దిల్‌ రాజు డ్రీమ్స్‌ బృందం స్వయంగా వారిని సంప్రదిస్తుంది. తమ ఆలోచనలను యువ ప్రతిభావంతులు ఈ బృందం దృష్టికి తీసుకెళ్లవచ్చు. తమ టాలెంట్‌ను నిరూపించుకోవాలనుకొనే వారు ఎంతో మంది ఎవరిని ఎలా ఎప్రోచ్‌ అవ్వాలో, ముందుకు ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారికి నిజంగా ఇది గోల్డెన్‌ ఛాన్స్‌.

Updated Date - May 22 , 2025 | 06:12 AM