ఆ సినిమాను అంగీకరించారా?
ABN , Publish Date - Feb 10 , 2025 | 06:14 AM
హీరోయిన్ శ్రీలీల వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే పవన్‌కల్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, రవితేజతో ‘మాస్ జాతర’, నితిన్‌తో ‘రాబిన్‌హుడ్’, శివకార్తీకేయన్‌తో ‘పరాశక్తి’ సినిమాల్లో నటిస్తున్నారీ బ్యూటీ....
హీరోయిన్ శ్రీలీల వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే పవన్‌కల్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, రవితేజతో ‘మాస్ జాతర’, నితిన్‌తో ‘రాబిన్‌హుడ్’, శివకార్తీకేయన్‌తో ‘పరాశక్తి’ సినిమాల్లో నటిస్తున్నారీ బ్యూటీ. అయితే, ఆమెకు మరో అసక్తికరమైన ప్రాజెక్ట్‌లో నటించేందుకు ఆఫర్ వచ్చిందని సమాచారం. 2023లో విడుదలై విజయవంతమైన ‘మంగళవారం’ సినిమా సీక్వెల్‌లో ఆమె నటిస్తున్నట్లు టాక్. తొలి భాగంలో కథానాయికగా నటించిన పాయల్ రాజ్‌పుత్ ఈ చిత్రం సీక్వెల్‌లో నటించట్లేదని తెలుస్తోంది. ఆమె స్థానంలో నటించేందుకు శ్రీలీలకు ఆఫర్ వచ్చిందట. ఇందుకు ఆమె అంగీకరించారా లేదా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా స్ర్కిప్టు పనుల్లో బిజీగా ఉన్నారు దర్శకుడు అజయ్ భూపతి. ఈ ఏడాదిలోనే సీక్వెల్‌ను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.