మాజీ రాష్ట్రపతి కలామ్ బయోపిక్‌లో ధనుష్
ABN , Publish Date - May 22 , 2025 | 06:08 AM
తమిళ హీరో ధనుష్ హీరోగా మరో క్రేజీ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏ.పీ.జే అబ్దుల్ కలామ్ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌లో ఆయన...
తమిళ హీరో ధనుష్ హీరోగా మరో క్రేజీ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏ.పీ.జే అబ్దుల్ కలామ్ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌లో ఆయన నటించనున్నారు. బుధవారం, కేన్స్ చిత్రోత్సవంలో ఈ సినిమా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ చిత్ర టైటిల్ ‘కలామ్’. ‘ద మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అనేది ఉపశీర్షిక. ‘తానాజీ: ద అన్‌సంగ్ వారియర్’, ‘ఆదిపురుష్’ చిత్రాల దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించనున్నారు. అభిషేక్ అగర్వాల్, భూషణ్‌కుమార్, అనిల్ సుంకర, కృషన్‌కుమార్ నిర్మించనున్నారు. అబ్దుల్ కలామ్ జీవితాన్ని, భారతీయ అంతరిక్ష, రక్షణ రంగాలకు ఆయన చేసిన అపూర్వ సేవలను ఈ చిత్రం ద్వారా హృద్యంగా ఆవిష్కరించనున్నారు. ఇతర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.