చిరునవ్వులు చిందిస్తూ
ABN , Publish Date - May 09 , 2025 | 01:14 AM
నాగార్జున, ధనుశ్ ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం ‘కుబేర’. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్‌మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు...
నాగార్జున, ధనుశ్ ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం ‘కుబేర’. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్‌మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయిక. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ప్రధాన పాత్రధారుల ఫస్ట్‌లుక్ పోస్టర్లు, ఫస్ట్ సింగిల్ ‘పోయిరా మామా’ సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా, ఈ సినిమా నుంచి ధనుశ్, రష్మిక కలసి ఉన్న స్టిల్‌ను విడుదల చేశారు మేకర్స్. చిరునవ్వులు చిందిస్తున్న ఈ ఇద్దరి లుక్ ప్రస్తుతం అందర్నీ ఆకట్టుకుంటోంది. జూన్ 20న సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.