ప్రభాస్ తో మరోసారి?

ABN , Publish Date - May 04 , 2025 | 03:17 AM

ప్రభాస్‌ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో బాలీవుడ్‌ భామ దీపికా పదుకోన్‌ ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె మరోసారి ప్రభాస్‌ చిత్రంలో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని...

ప్రభాస్‌ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో బాలీవుడ్‌ భామ దీపికా పదుకోన్‌ ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె మరోసారి ప్రభాస్‌ చిత్రంలో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని బాలీవుడ్‌ సమాచారం. దర్శకుడు సందీ్‌పరెడ్డి వంగా రూపొందించే ‘స్పిరిట్‌’ చిత్రంలో ప్రభాస్‌ హీరోయిన్‌గా దీపిక నటించనున్నారు. నిజానికి ‘స్పిరిట్‌’ చిత్రం గత ఏడాదే ప్రారంభం కావాలి. ఆ సమయంలో హీరోయిన్‌ పాత్ర కోసం దీపికను సందీప్‌ సంప్రదించారు. కానీ అప్పుడు ఆమె గర్భవతి కావడంతో ఆ చిత్రంలో నటించలేనని చెప్పేశారు. ఇప్పుడు ‘స్పిరిట్‌’ షూటింగ్‌ షెడ్యూల్‌ డిలే కావడంతో సందీప్‌ మరోసారి దీపికను సంప్రదించారనీ, ఆ సినిమా కథ, అందులో హీరోయిన్‌ పాత్ర నచ్చి నటించడానికి వెంటనే అంగీకరించారనీ బీటౌన్‌ టాక్‌. ఇటీవలే షారుక్‌ ఖాన్‌ ‘కింగ్‌’ చిత్రంలో నటించడానికి దీపిక అంగీకరించారు. తాజాగా ‘స్పిరిట్‌’ చిత్రం కూడా ఒప్పుకోవడంతో ఈ ఏడాది చివరి వరకూ ఆమె డేట్స్‌ ఖాళీ లేనట్లే. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం ‘స్పిరిట్‌’ చిత్రం ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రారంభించి. 2027 ఫస్ట్‌ హాఫ్‌లో విడుదల చేయాలని నిర్మాత భూషణ్‌కుమార్‌ ప్లాన్‌. ఈ చిత్రం షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభమయ్యేదీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అలాగే హీరోయిన్‌గా దీపికను హీరోయిన్‌గా ఎంపిక చేసిన విషయాన్ని కూడా.

Updated Date - May 04 , 2025 | 03:17 AM