ఏడాదికి రెండు సినిమాలు

ABN , Publish Date - May 13 , 2025 | 02:53 AM

కిరణ్‌, అలేఖ్యా రెడ్డి జంటగా నటించిన ‘దీక్ష’ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. జూన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా...

కిరణ్‌, అలేఖ్యా రెడ్డి జంటగా నటించిన ‘దీక్ష’ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. జూన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో దర్శకనిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ ‘పట్టుదల, దీక్షతో పని చేస్తే ఏదైనా సాధించవచ్చు అనే పాయింట్‌తో ఫ్యామిలీ డ్రామాగా చిత్రం రూపుదిద్దుకుంటోంది. అలాగే పౌరాణిక అంశం కూడా జోడించాం. హీరో కిరణ్‌ భీముడి పాత్రలో కనిపిస్తారు. మా బేనరులో వస్తున్న 41వ సినిమా ఇది. దీని తర్వాత ‘కబడ్డీ’ సినిమా తీస్తున్నాం. ఏడాదికి రెండు సినిమాలైనా చేయాలని మా ప్లాన్‌’ అని చెప్పారు.ఈ సినిమాలో హీరోగా నటించడం ఆనందంగా ఉందని కిరణ్‌ చెప్పారు. చిత్రంలో మంచి పాత్ర పోషించినట్లు నటి అక్సా ఖాన్‌ తెలిపారు. సినిమాలో విలన్‌గా నటించినట్లు రోహిత్‌ శర్మ చెప్పారు.

Updated Date - May 13 , 2025 | 02:53 AM