మహిళలకు అంకితం
ABN , Publish Date - Mar 06 , 2025 | 04:51 AM
‘ఇంతవరకూ ఎనిమిది సినిమాలకు సంగీత దర్శకత్వం వహించా. నిర్మాత అశోక్ సహకారంతో ఇప్పుడు దర్శకుడిగా మారాను...
‘ఇంతవరకూ ఎనిమిది సినిమాలకు సంగీత దర్శకత్వం వహించా. నిర్మాత అశోక్ సహకారంతో ఇప్పుడు దర్శకుడిగా మారాను. మహిళా దినోత్సవం సందర్భంగా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని మహిళలకు అంకితం ఇస్తున్నాం’ అన్నారు షెరాజ్ మెహ్ది. ఆయన రూపొందించిన ‘పౌరుషం’ చిత్రం ఈ నెల 7న విడుదలవుతున్న సందర్భంగా బుధవారం జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో నిర్మాత అశోక్ ఖుల్లార్ మాట్లాడుతూ ‘ఇందులో రొమాన్స్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా అన్నీ ఉన్నాయి. ప్రపంచంలో ఆడవాళ్లు లేకుండా మగవాళ్లు లేరు. వాళ్ల సపోర్ట్‌తో మనం ముందుకు వెళ్లాలి అనే కాన్పె్‌ప్టతో ఈ చిత్రాన్ని రూపొందించాం. సినిమా బాగా వచ్చింది. మంచి కంటెంట్ కలిగిన ఈ చిత్రాన్ని ఆదరించమని కోరుతున్నాం’ అన్నారు. సుమన్, మేకా రామకృష్ణ, షెరాజ్, అశోక్ ఖుల్లార్, కుష్బూ జైన్, జ్యోతిరెడ్డి తదితరులు ఈ చిత్రంలో నటించారు.