ప్రేమ ప్రతీకారం మోసం
ABN , Publish Date - May 27 , 2025 | 03:23 AM
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా షానియల్ డియో దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా చిత్రం ‘డెకాయిట్’. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు...
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా షానియల్ డియో దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా చిత్రం ‘డెకాయిట్’. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాత. క్రిస్మస్ సందర్భంగా డిసెంబరు 25న థియేటర్లలో విడుదల కానుంది. సోమవారం ఈ చిత్రం నుంచి మేకర్స్ ఫైర్ గ్లింప్స్ విడుదల చేశారు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య నెలకొన్న ఉద్రిక్త క్షణాల్లో గ్లింప్స్ ప్రారంభమౌతుంది. సానుభూతితో నిండిన వాయి్‌సలో శేష్ ఆమెను ‘జూలియట్’ అని పిలుస్తాడు. అందరూ ఆమెకు అన్యాయం చేశారని చెబుతాడు. కానీ వెంటనే అతని స్వరం మారుతుంది. ‘నేను నిన్ను మోసగించడానికి రాలేదు. అంత కంటే ఎక్కువ చేస్తా’ అంటూ అనుమానాస్పద నవ్వుతో శేష్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. మరో ఎపిసోడ్‌లో.. ఖైదీ యూనిఫాంలో జైలు వ్యాన్‌లో ఉన్న శేష్ కూల్‌గా తన నోటి నుంచి ఒక కీని బయటకు తీస్తాడు. తర్వాత ఓ రైలు ఆ వ్యాన్ మీదుగా దూసుకెళ్తుంది. చివరి సన్నివేశంలో.. మృణాల్ అతని పక్కన కూర్చుంటుంది. శేష్ కాల్పులు జరుపుతాడు. మొత్త్తానికి గ్లింప్స్‌ని బట్టి ప్రేమ, ప్రతీకారం, మోసంతో నిండిన కథ అని అర్థమవుతోంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం అందించారు.