మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్
ABN , Publish Date - May 15 , 2025 | 02:54 AM
విజయ్ ఆంటోని కథానాయకుడిగా స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్న చిత్రం ‘మార్గన్’. ఆయన సతీమణి మీరావిజయ్ ఆంటోని సమర్పిస్తున్నారు. ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌ను...
విజయ్ ఆంటోని కథానాయకుడిగా స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్న చిత్రం ‘మార్గన్’. ఆయన సతీమణి మీరావిజయ్ ఆంటోని సమర్పిస్తున్నారు. ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌ను లియోజాన్ పాల్ తెరకెక్కిస్తున్నారు. విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధీషన్ ఈ సినిమాతో పరిచయమౌతున్నారు. సముద్రఖని, మహానటి శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలె విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి ఆదరణ లభించింది. తాజాగా. ఈ సినిమాను జూన్ 27న విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఓ నూతన పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. సినిమా అన్ని వర్గాలనూ ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: యువ.ఎన్.ఎ్‌స, సంగీతం: విజయ్ ఆంటోని.