పుట్టిన వారికి మరణం తప్పదు
ABN , Publish Date - Jan 03 , 2025 | 06:20 AM
జేడీ చక్రవర్తి, నరేశ్ అగస్త్య, సీరత్ కపూర్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘జాతస్య మరణం ధ్రువం’. శ్రవణ్ జొన్నాడ రచన, దర్శకత్వంలో ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని...
జేడీ చక్రవర్తి, నరేశ్ అగస్త్య, సీరత్ కపూర్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘జాతస్య మరణం ధ్రువం’. శ్రవణ్ జొన్నాడ రచన, దర్శకత్వంలో ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ప్రీతి జంఘియానీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. కాగా, ఈ సినిమాకు ‘జాతస్య మరణం ధ్రువం’ అని టైట్‌ల్ ఖరారు చేసిన మేకర్స్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని లాంచ్ చేశారు. ఒక సంస్కృత పదం నుంచి వచ్చిన ఈ టైటిల్‌కు ‘పుట్టిన వారికి మరణం తప్పదు’ అని అర్థం. ఈ మూవీకి అర్జున్ రాజా డీవోపీ, జిబ్రాన్, రాజ్ ఆషూ సంగీతం అందించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.