‘దసరా’ విలన్‌ తండ్రి దుర్మరణం

ABN , Publish Date - Jun 07 , 2025 | 05:55 AM

తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ‘దసరా’ మూవీ విలన్‌ షైన్‌ టాన్‌ చాకో తండ్రి సీపీ చాకో (70) దుర్మరణం పాలయ్యారు.

మిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ‘దసరా’ మూవీ విలన్‌ షైన్‌ టాన్‌ చాకో తండ్రి సీపీ చాకో (70) దుర్మరణం పాలయ్యారు. చాకో భార్య మరియా కార్మేల్‌ (65)లతో పాటు మొత్తం నలుగురు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. రోడ్డు పక్కన నిలిపివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు.. లారీ కిందకు వెళ్ళిపోవడంతో నుజ్జునుజ్జు అయిపోయింది. దీంతో కారులోని వారంతా అందులో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని చూసిన ఇతర వాహనదారులు పోలీసులకు సమాచారమిచ్చి వారిని రక్షించారు. వీరిలో షైన్‌ తండ్రి సీపీ చాకో ప్రాణాలు కోల్పోగా, మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు.

చెన్నై (ఆంధ్రజ్యోతి)

Updated Date - Jun 07 , 2025 | 05:56 AM