ప్రేక్షకులకు చేరువవుతా
ABN , Publish Date - Jan 09 , 2025 | 12:50 AM
శ్రద్ధా శ్రీనాథ్ నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’. బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు....
శ్రద్ధా శ్రీనాథ్ నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’. బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఈ నెల 12న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా శ్రద్ధా మీడియాతో ముచ్చటించారు.
‘‘నేను ఈ సినిమాలో నందిని అనే పాత్రలో నటించాను. నటనకు ఆస్కారముండే పాత్ర ఇది. నందిని పాత్రను దర్శకుడు చాలా బాగా డిజైన్ చేశారు. ఇలాంటి పాత్రను నేను ఇప్పటివరకు చేయలేదు. ఈ క్యారెక్టర్ ప్రతీ విషయంలో ఎంతో స్పష్టతతో పాటు ఓపికగా ఉంటుంది. నేను నటించిన వాటిలో పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా ఇదే. ఈ సినిమాతో ప్రేక్షకులకు మరింత చేరువవుతాను. బాలకృష్ణతో పనిచేయడం మరిచిపోలేని అనుభవం. ఆయనలో కొంచెం కూడా స్టార్ అనే ఫీలింగ్ చూడలేదు. ఆయన దర్శకులు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉంటారు. దర్శకుడు బాబీ కొల్లి ఎంతో ప్రతిభ గల దర్శకుడు. ప్రతీ విషయంలో చాలా స్పష్టతతో ఉంటారు. ఈ సినిమాకు తమన్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఇది మాస్ ప్రేక్షకులతో పాటు కుటుంబ ప్రేక్షకులను పాటు విపరీతంగా ఆకట్టుకునే సినిమా’’ అని చెప్పారు.