వివాదాస్పద పాటలో మార్పు

ABN , Publish Date - May 16 , 2025 | 04:00 AM

తమిళ నటుడు సంతానం హీరోగా నటించిన ‘డెవిల్స్‌ డబుల్‌ నెక్స్ట్‌ లెవల్‌’ చిత్రంలోని ‘శ్రీనివాసా గోవిందా’ పాటలో మార్పులు చేసి, మళ్లీ సెన్సార్‌ బోర్డు నుంచి సర్టిఫికేట్‌ తీసుకుంటామని...

తమిళ నటుడు సంతానం హీరోగా నటించిన ‘డెవిల్స్‌ డబుల్‌ నెక్స్ట్‌ లెవల్‌’ చిత్రంలోని ‘శ్రీనివాసా గోవిందా’ పాటలో మార్పులు చేసి, మళ్లీ సెన్సార్‌ బోర్డు నుంచి సర్టిఫికేట్‌ తీసుకుంటామని చిత్ర నిర్మాత హైకోర్టుకు తెలిపారు. ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. అయితే, ఈ చిత్రంలో ‘శ్రీనివాసా గోవిందా’ అనే పాట చరణాలు శ్రీవేంకటేశ్వర స్వామిని కించపరిచేలా ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి. ఈ పాటను తక్షణం తొలగించాలని, లేనిపక్షంలో రూ.100 కోట్ల పరువునష్టం చెల్లించాలంటూ హీరో సంతానంకు టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాశ్‌ లీగల్‌ నోటీసులు పంపించారు. అదేవిధంగా చెన్నైకి చెందిన బాలాజీ అనే వ్యక్తి ఈ చిత్ర సెన్సార్‌ సర్టిఫికేట్‌ను రద్దు చేయాలని, విడుదలను అడ్డుకోవాలని కోరుతూ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. గురువారం ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

Updated Date - May 16 , 2025 | 04:00 AM