సినిమాకు కంటెంటే ముఖ్యం
ABN , Publish Date - Feb 11 , 2025 | 04:56 AM
ఆదిత్య, ప్రియ జంటగా రాజ్ లోహిత్ దర్శకత్వంలో చందన్ కుమార్ కొప్పుల నిర్మించిన చిత్రం ‘తకిట తదిమి తందాన’. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి...
ఆదిత్య, ప్రియ జంటగా రాజ్ లోహిత్ దర్శకత్వంలో చందన్ కుమార్ కొప్పుల నిర్మించిన చిత్రం ‘తకిట తదిమి తందాన’. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘తక్కువ బడ్జెట్ చిత్రమా? కొత్త నటీనటులా అనే విషయాన్ని పట్టించుకోకుండా మంచి కంటెంట్‌తో ఫీల్‌గుడ్‌గా నిలిచే సినిమాలు విజయవంతమవుతున్నాయి. కంటెంట్ ప్రధానంగా వచ్చే చిత్రాలే ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతున్నాయి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత రామసత్యనారాయణ, సినీటేరియా మీడియా వర్క్స్ అధినేత వెంకట్, దర్శకుడు రాజ్‌లోహిత్ పాల్గొన్నారు. ఈనెల 27న చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నిర్మాత చందన్‌కుమార్ తెలిపారు.
For Telangana News And Telugu News