RP Patnaik : కిల్లర్ కథ
ABN , Publish Date - Feb 01 , 2025 | 03:54 AM
సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్ కథను అందిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘కాఫీ విత్ ఎ కిల్లర్’. సెవెన్‌హిల్స్ సతీశ్ నిర్మించారు. శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేశ్, టెంపర్ వంశీ కీలకపాత్రలు పోషించారు.
సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్ కథను అందిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘కాఫీ విత్ ఎ కిల్లర్’. సెవెన్‌హిల్స్ సతీశ్ నిర్మించారు. శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేశ్, టెంపర్ వంశీ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం శుక్రవారం నుంచి ఆహా ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ అవనుంది. ఈ సందర్భంగా చిత్రబృందం మీడియా సమావేశం నిర్వహించింది. ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ ‘హీరో హీరోయిన్ లేకుండా విలన్ మాత్రమే ఉండేలా ఒక సినిమా తీయాలనే ఆలోచనతో ఈ కథ మొదలైంది. కథే ఈ చిత్రానికి హీరో’ అని చెప్పారు. సెవెన్‌హిల్స్ సతీష్ మాట్లాడుతూ ‘మంచి సినిమా చేశాము. ఒక కాన్సె్‌ప్టని కథగా అనుకొని, సినిమాగా తీసి మీ ముందుకు తీసుకొస్తున్నాం’ అన్నారు.