నేటి రాజకీయాల నేపథ్యంలో..

ABN, Publish Date - May 07 , 2025 | 01:35 AM

ఇంద్రజ, అజయ్‌ ప్రధాన పాత్రల్లో గడ్డం రమణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సీఎం పెళ్లాం’. బొల్ల రామకృష్ణారెడ్డి నిర్మించారు. ఈ శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా చిత్రబృందం...

ఇంద్రజ, అజయ్‌ ప్రధాన పాత్రల్లో గడ్డం రమణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సీఎం పెళ్లాం’. బొల్ల రామకృష్ణారెడ్డి నిర్మించారు. ఈ శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా చిత్రబృందం మీడియాతో మాట్లాడింది. చిత్ర దర్శకుడు రమణారెడ్డి మాట్లాడుతూ ‘ఎమ్మెల్యే బిజీగా ఉండి బయట తిరుగుతున్న సమయంలో.. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వచ్చిన ప్రజలను ఆ ఎమ్మెల్యే పెళ్లాం కలసి మాట్లాడితే వ్యవస్థలో చాలా మార్పులు వస్తాయని నమ్మాను. అదే ఈ సినిమాలో చూపించాను. రాజకీయ నాయకులు బూతులు మాట్లాడొద్దన్న పాయింట్‌నూ చూపించాను’ అని చెప్పారు. అజయ్‌ మాట్లాడుతూ ‘మహిళా సాధికారత గురించి వివరించిన ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. చిత్ర నిర్మాత రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ప్రజలకు సేవ చేస్తే ఎలా ఉంటుంది? రాష్ట్రం ఏవిధంగా బాగుపడుతుంది అనే కోణంలో చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాం’ అని తెలిపారు.

Updated Date - May 07 , 2025 | 01:35 AM