Trinadhrao Director: కొత్తవారికి అవకాశం కల్పించాలనే
ABN, Publish Date - Apr 25 , 2025 | 06:25 AM
దర్శకుడు నక్కిన త్రినాధరావు, ‘చౌర్యపాఠం’ సినిమాతో కొత్తవారికి వేదిక కల్పించేందుకు పట్టారు. ఈ సినిమా ఒక చిలిపి దొంగతనం కేసు ఆధారంగా సినిమాటిక్‌గా తెరకెక్కించబడింది
‘కొత్తవాళ్లకు ఒక వేదికను ఏర్పాటు చేయాలనేది నా కల. అది ఎప్పటి నుంచో ఉంది. అందుకే సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాను. నాకు సంపాదన మీద దృష్టి లేదు’ అని అన్నారు దర్శకుడు నక్కిన త్రినాధరావు. ఆయన నిర్మాణంలో వస్తున్న తొలి చిత్రం ‘చౌర్యపాఠం’. ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్లు. నిఖిల్ గొల్లమాని తెరకెక్కించారు. నేడు సినిమా విడుదలవుతున్న సందర్భంగా త్రినాధరావు మీడియాతో మాట్లాడుతూ ‘ఓ చిలిపి దొంగతనం కేసు గురించి విన్నప్పుడు ఆసక్తిగా అనిపించింది. ఈ కథతో సినిమా చేయమని కార్తిక్‌ని అడిగితే సరే అన్నాడు. అలా ఈ కథ పట్టాలెక్కింది. అయితే ఆ కేసును స్ఫూర్తిగా తీసుకొని పూర్తి సినిమాటిక్‌గా తెరకెక్కించాం. మా ప్రొడక్షన్ హౌజ్ నుంచి వస్తున్న తొలి చిత్రం గనుక నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడలేదు. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు. మూవీలో క్యారెక్టర్స్ తప్ప ఆర్టిస్టులు కనిపించరు. అంత సహజంగా పాత్రల్లో ఒదిగిపోయారు. ఇందులోని అన్ని పాటలు హిట్ అయ్యాయి’ అని తెలిపారు.