ఆదరణ అపూర్వం

ABN , Publish Date - May 14 , 2025 | 05:49 AM

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం విశ్వంభర’. వశిష్ఠ దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌ బేనర్‌పై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ఇటీవలే చిత్రబృందం ‘రామ రామ’ అంటూ శ్రీరాముని కీర్తిస్తూ సాగే తొలి గీతాన్ని...

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం విశ్వంభర’. వశిష్ఠ దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌ బేనర్‌పై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ఇటీవలే చిత్రబృందం ‘రామ రామ’ అంటూ శ్రీరాముని కీర్తిస్తూ సాగే తొలి గీతాన్ని విడుదల చేసింది. ఆ పాటకు చక్కటి ప్రేక్షకాదరణ దక్కుతోందని చిత్రబృందం తెలిపింది. ‘రామ రామ’ గీతాన్ని అమితంగా ఆదరిస్తున్న సంగీత ప్రియులకు ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా మంగళవారం విశ్వంభర కొత్తపోస్టర్‌ను విడుదల చేసింది. అందులో చిరు తనదైన శైలిలో ఉల్లాసంగా స్టెప్పులేస్తూ కనిపించారు. ఈ చిత్రంలో త్రిష, ఆషికి రంగనాథ్‌ కథానాయికలు. కునాల్‌కపూర్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. సంగీతం: ఎం.ఎం. కీరవాణి, సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు

Updated Date - May 14 , 2025 | 05:49 AM