కేన్స్ వేదికపై విశ్వంభర
ABN , Publish Date - May 23 , 2025 | 04:12 AM
చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్ బేనర్‌పై విక్రమ్ రెడ్డి, ప్రమోద్, వంశీ నిర్మిస్తున్నారు. నిర్మాత విక్రమ్‌రెడ్డి గురువారం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో...
చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్ బేనర్‌పై విక్రమ్ రెడ్డి, ప్రమోద్, వంశీ నిర్మిస్తున్నారు. నిర్మాత విక్రమ్‌రెడ్డి గురువారం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ‘విశ్వంభర’ విశేషాలతో ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ పుస్తకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని త్వరలో వెల్లడిస్తామని ఆయన చెప్పారు. అలాగే ఈ సినిమా కథ, వీఎ్‌ఫఎక్స్‌కు ఉన్న ప్రాథాన్యం గురించి విక్రమ్‌రెడ్డి వివరించారు. ‘విశ్వంభర’ నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశలో ఉన్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలు. సంగీతం: కీరవాణి, సినిమాటోగ్రఫీ: ఛోటా కె. నాయుడు