UK Parliament: చిరంజీవికి అరుదైన గౌరవం
ABN , Publish Date - Mar 15 , 2025 | 02:55 AM
లీవుడ్ కథానాయకుడు చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగానికి అందిస్తోన్న విశేష సేవలను గుర్తిస్తూ ఆయన్ను హౌస్ ఆఫ్ కామన్స్ ..
Cinema News: టాలీవుడ్ కథానాయకుడు చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగానికి అందిస్తోన్న విశేష సేవలను గుర్తిస్తూ ఆయన్ను హౌస్ ఆఫ్ కామన్స్ ..యూకే పార్లమెంట్ ఘనంగా సత్కరించనుంది. యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో ఈనెల 19న ఈ కార్యక్ర మాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. పలువురు యూకే పార్లమెంట్ సభ్యులు, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ కూడా చిరంజీవిని సత్కరించనుంది.
సినిమా, ప్రజాసేవలో చిరంజీవి చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ‘జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు చిరంజీవికి అభినందనలు తెలిపారు.