చీర కట్టులో అవని

ABN, Publish Date - May 05 , 2025 | 05:08 AM

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘విశ్వంభర’. త్రిష కృష్ణన్‌ కథానాయిక. యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. ఆదివారం త్రిష పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ...

చీర కట్టులో అవని

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘విశ్వంభర’. త్రిష కృష్ణన్‌ కథానాయిక. యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. ఆదివారం త్రిష పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్‌ ప్రత్యేక పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఈ చిత్రంలో త్రిష అవని పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. చీర కట్టులో త్రిష మెరిసిపోతూ కనిపించారు. 2006లో విడుదలైన ‘స్టాలిన్‌’ తర్వాత చిరంజీవి, త్రిష కలసి నటిస్తున్న చిత్రమిది. సృష్టి, స్థితి, లయ ఈ మూడింటి నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగనున్నట్లు సమాచారం. సినిమాలో భారీ సన్నివేశాలు ఉంటాయని ఇప్పటికే చిత్ర యూనిట్‌ వెల్లడించింది. ఆంజనేయ భక్తునిగా చిరంజీవి కనిపించనున్నారు. ఆషికా రంగనాథ్‌, కునాల్‌ కపూర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Updated Date - May 05 , 2025 | 05:08 AM