ఆ పాఠమేంటో తెలియాలంటే సినిమా చూడాలి
ABN , Publish Date - Apr 17 , 2025 | 02:28 AM
దర్శకుడు త్రినాథరావు నక్కిన నిర్మాతగా వ్యవహరించిన చిత్రం ‘చౌర్య పాఠం’. ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నిఖిల్ గొల్లమారి తెరకెక్కించారు...
దర్శకుడు త్రినాథరావు నక్కిన నిర్మాతగా వ్యవహరించిన చిత్రం ‘చౌర్య పాఠం’. ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నిఖిల్ గొల్లమారి తెరకెక్కించారు. ఈ నెల 25న సినిమా విడుదలవుతోంది. బుధవారం సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ ‘‘ఈ మధ్య థియేటర్లకు ప్రేక్షకులు రావడం బాగా తగ్గిపోయింది. అలాంటి సమయంలో చిన్న సినిమా తెరకెక్కించడమంటే సాహసమే. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులోని పాత్రధారి ఓ అవసరం కోసం దొంగతనం చేసినప్పుడు తెలుసుకున్న పాఠమే ఈ చిత్ర కథాంశం. ఆ పాఠమేంటో తెలియాలంటే సినిమా చూడండి’’ అని చెప్పారు. ‘‘సినిమా అద్భుతంగా వచ్చింది’’ అని దర్శకుడు నిఖిల్ గొల్లమారి చెప్పారు.