ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు
ABN, Publish Date - Apr 27 , 2025 | 01:14 AM
ఇంద్రారామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నిఖిల్ గొల్లమారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చౌర్య పాఠం’. దర్శకుడు త్రినాధరావు నక్కిన ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. సినిమా ఇటీవలె విడుదలైన సందర్భంగా...
ఇంద్రారామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నిఖిల్ గొల్లమారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చౌర్య పాఠం’. దర్శకుడు త్రినాధరావు నక్కిన ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. సినిమా ఇటీవలె విడుదలైన సందర్భంగా చిత్రబృందం ‘గ్రాటిట్యూడ్ మీట్’ని శనివారం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ ‘బుకింగ్స్ రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మా సినిమాను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తెరపై యాక్టర్స్ కాకుండా క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయని ప్రేక్షకులు అంటున్నారు’ అని అన్నారు. దర్శకుడు నిఖిల్ మాట్లాడుతూ ‘మా సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందం కలుగుతోంది’ అని చెప్పారు. కథానాయకుడు ఇంద్రారామ్ మాట్లాడుతూ ‘ఈ రోజుల్లో ఆడియన్స్ థియేటర్లకు రావడం కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సినిమాకి వచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అని అన్నారు.