సూర్య సినిమాలో ఛాన్స్‌?

ABN, Publish Date - Feb 18 , 2025 | 01:10 AM

‘మిస్టర్‌ బచ్చన్‌’తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. ప్రస్తుతం రామ్‌ పోతినేనితో ‘రాపో 22’ (వర్కింగ్‌ టైటిల్‌), దుల్కర్‌ సల్మాన్‌తో ‘కాంత’ వంటి వరుస సినిమాలతో...

‘మిస్టర్‌ బచ్చన్‌’తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. ప్రస్తుతం రామ్‌ పోతినేనితో ‘రాపో 22’ (వర్కింగ్‌ టైటిల్‌), దుల్కర్‌ సల్మాన్‌తో ‘కాంత’ వంటి వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆమెకు మరో క్రేజీ ఆఫర్‌ దక్కినట్టు తెలుస్తోంది. ‘లక్కీ భాస్కర్‌’ సినిమాతో సూపర్‌హిట్‌ కొట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి తమిళ కథానాయకుడు సూర్యతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లోకి కథానాయికగా భాగ్యశ్రీని సంప్రదించగా, దానికి ఆమె పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. మే నుంచి ఈ సినిమాను పట్టాలెక్కించడానికి ప్లాన్‌ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

ప్రాక్టీస్ మొదలుపెట్టిన క్రికెట్ గాడ్.. ఫ్యాన్స్‌కు పండగే

రోహిత్ తిరుగులేని వ్యూహం.. పక్కా స్కెచ్‌తో

ధోని నుంచి రోహిత్ ఎరా వరకు.. డాక్యుమెంటరీ చూశారా..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 18 , 2025 | 01:10 AM