First Look : అఖండలా బ్రహ్మాండ
ABN , Publish Date - Jan 11 , 2025 | 02:37 AM
ఒగ్గు కళాకారుల జీవితాల నేపథ్యంలో వారి సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ రూపొందించిన చిత్రం ‘బ్రహ్మాండ’.
ఒగ్గు కళాకారుల జీవితాల నేపథ్యంలో వారి సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ రూపొందించిన చిత్రం ‘బ్రహ్మాండ’. రాంబాబు దర్శకత్వంలో దాసరి సురేశ్ నిర్మించారు. ఆమని, జయరామ్, బన్నీరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల చివరివారంలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి ‘బ్రహ్మాండ’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశార. ‘‘అఖండ’ చిత్రంలా ‘బ్రహ్మాండ’ సినిమా కూడా ఘన విజయం సాధించాలి’ అని ఆయన ఆకాంక్షించారు. ఈ చిత్రానికి సంగీతం: వరికుప్పల యాదగిరి, సినిమాటోగ్రఫీ: కాసుల కార్తిక్