Bhogi: విడుదలకు సిద్ధం అవుతున్న భోగి
ABN, Publish Date - May 02 , 2025 | 04:11 PM
పీసీ క్రియేషన్స్ పతాకంపై వరుణ్.K దర్శకత్వలో ప్రదీప్ చంద్ర నిర్మాతగా రూపొందుతున్న చిత్రం 'భోగి'. సస్పెన్స్ కధాంశంతో, యూత్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం, షూటింగ్ పూర్తి చేసుకుంది.
పీసీ క్రియేషన్స్ పతాకంపై వరుణ్.K దర్శకత్వలో ప్రదీప్ చంద్ర నిర్మాతగా రూపొందుతున్న చిత్రం 'భోగి'. సస్పెన్స్ కధాంశంతో, యూత్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం, షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలను శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు నెలలో విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇదివరకే విడుదలయ్యి మంచి ప్రజాదరణ పొందింది విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా డైరెక్టర్ వరుణ్.కె మాట్లాడుతూ "నేను కెరీర్ తొలినాళ్లలో 15కు పైగా షార్ట్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేశాను. , 2 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను., అప్పుడు నాతో కలిసి పనిచేసిన ప్రదీప్ చంద్ర తో కలిసి ఒక సినిమాను ప్లాన్ చేశాను. నేను అనుకున్న లైన్ బాగా నచ్చడంతో 2022లో ఈ భోగి చిత్రాన్ని మొదలుపెట్టాం. కథకు తగ్గట్లుగానే భోగి అనే పవర్ఫుల్ టైటిల్ తో మీ ముందుకు వస్తున్నాం. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తాం" అన్నారు.