పండగ పేరుతో శర్వా కొత్త సినిమా
ABN , Publish Date - May 01 , 2025 | 06:01 AM
శర్వానంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. 1960ల కాలంలో...
శర్వానంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. 1960ల కాలంలో ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల నేపథ్యంలో సాగనుందీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్స్. బుధవారం ఈ సినిమా టైటిల్‌ను ఖరారు చేస్తూ ‘స్పార్క్’ అనే కాన్సెప్ట్ వీడియో విడుదల చేశారు. టైటిల్ ‘భోగి’. రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టినట్లు ప్రకటించారు. ఇందులో మునుపెన్నడూ చూడనంత శక్తిమంతమైన పాత్రలో శర్వా కనిపించనున్నట్లు మేకర్స్ తెలిపారు.