Bhairavam Movie Song: అలరించే ప్రేమగీతం

ABN , Publish Date - May 24 , 2025 | 01:48 AM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, అదితి శంకర్‌పై చిత్రీకరించిన ప్రేమగీతం ‘గిచ్చమాకే’ విడుదలైంది. వినోదంతో మొదలై భావోద్వేగాలతో ముగుస్తుందని మేకర్స్‌ తెలిపారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, మంచు మనోజ్‌, నారా రోహిత్‌ కథానాయకులుగా తెరకెక్కిన చిత్రం ‘భైరవం’. విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో కేకే రాధామోహన్‌ నిర్మించారు. అదితి శంకర్‌, ఆనంది, దివ్యపిళ్లై కథానాయికలు. డాక్టర్‌ జయంతిలాల్‌ గడ సమర్పిస్తున్నారు. ఈనెల 30న విడుదలవుతోంది. ‘గిచ్చమాకే’ అంటూ సాగే గీతాన్ని చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, అదితి శంకర్‌పై చిత్రీకరించిన ఈ డ్యూయెట్‌కు కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించగా, శ్రీ చరణ్‌ పాకాల స్వరపరిచారు. ధనుంజయ్‌ సీపాన, సౌజన్య ఆలపించారు. ప్రథమార్థం అంతా వినోదాత్మకంగా, ఉల్లాసంగా నడుస్తుంది. ద్వితీయార్థంలో పతాక సన్నివేశాల్లో భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి అని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: హరి కే వేదాంతం, ఎడిటర్‌: చోటా కే ప్రసాద్‌.

Updated Date - May 24 , 2025 | 01:48 AM