Bhairavam Movie: భైరవం రాక ఖరారు
ABN , Publish Date - May 10 , 2025 | 06:40 AM
భైరవం సినిమా ప్రాజెక్టు ఆఫిషియల్‌గా ఖరారు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు రూపొందించనున్నారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న యాక్షన్ థ్రిలర్ చిత్రం ‘భైరవం’. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై కథానాయికలు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పవర్‌ఫుల్ పోస్టర్లు, యాక్షన్‌తో నిండిన టీజర్, రెండు సూపర్ హిట్ పాటలతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా మేకర్స్ ఈ చిత్రాన్ని మే 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. హరి కె వేదాంతం సినిమాటోగ్రఫీ, శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.