భైరవం నుంచి స్నేహగీతం

ABN , Publish Date - May 12 , 2025 | 04:54 AM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, మనోజ్‌ మంచు, నారా రోహిత్‌ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘భైరవం’. ఈ నెల 30న విడుదలవుతోంది...

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, మనోజ్‌ మంచు, నారా రోహిత్‌ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘భైరవం’. ఈ నెల 30న విడుదలవుతోంది. విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. స్నేహం గొప్పదనాన్ని వివరిస్తూ ‘డుమ్‌ డుమారే’ అంటూ సాగే గీతాన్ని ఆదివారం చిత్రబృందం విడుదల చేసింది. భాస్కరభట్ల సాహిత్యం అందించగా, రేవంత్‌, సాహితి చాగంటి ఆలపించారు. శ్రీ చరణ్‌ పాకాల స్వరపరిచారు. అదితి శంకర్‌, ఆనంది, దివ్యాపిళ్లై కథానాయిలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: హరి కె వేదాంతి

Updated Date - May 12 , 2025 | 04:54 AM