కచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది

ABN , Publish Date - May 18 , 2025 | 01:14 AM

‘‘భైరవం’ అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న మంచి యాక్షన్‌ థ్రిల్లర్‌. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఉత్కంఠకు, భావోద్వేగాలకు గురవుతారు. కచ్చితంగా ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ అవుతుంది’ అని అన్నారు దర్శకుడు విజయ్‌ కనకమేడల...

‘‘భైరవం’ అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న మంచి యాక్షన్‌ థ్రిల్లర్‌. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఉత్కంఠకు, భావోద్వేగాలకు గురవుతారు. కచ్చితంగా ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ అవుతుంది’ అని అన్నారు దర్శకుడు విజయ్‌ కనకమేడల. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, మంచు మనోజ్‌, నారా రోహిత్‌ హీరోలుగా విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహించిన చిత్రం ‘భైరవం’. డా.జయంతిలాల్‌ గడా సమర్పణలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ఈనెల 30న చిత్రం విడుదలవుతున్న సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘కథ కమర్షియల్‌గా నాకు చాలా నచ్చింది. అలాగే ముగ్గురు హీరోలతో పనిచేసే అవకాశం కూడా కలిగింది. ఇది రీమేక్‌ చిత్రమైనప్పటికీ ఒరిజినల్‌లో ఉన్న ఆర్గానిక్‌ ఎమోషన్‌ ఇందులో ఉంటుంది. క్యారెక్టరైజేషన్‌ ప్రజెంటేషన్‌ నా స్టయిల్‌లో ఉంటుంది. మంచి నటుల నుంచి సినిమా వస్తే ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్‌కి వస్తారనే నమ్మకం ఉంది. నా గత సినిమాలతో పోల్చుకుంటే ఈ చిత్రం ఎక్కువ ఆహ్లాదకరంగా ఉంటుంది’ అని తెలిపారు.

Updated Date - May 18 , 2025 | 01:14 AM