క్లాసిక్ లుక్‌లో
ABN , Publish Date - May 07 , 2025 | 01:40 AM
‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. తన అందం, అభినయంతో అందర్నీ ఆకట్టుకున్నారు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్‌తో ‘కాంత’, విజయ్ దేవరకొండతో ‘కింగడమ్’, రామ్ పోతినేనితో...
‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. తన అందం, అభినయంతో అందర్నీ ఆకట్టుకున్నారు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్‌తో ‘కాంత’, విజయ్ దేవరకొండతో ‘కింగడమ్’, రామ్ పోతినేనితో ‘రాపో 22’ (వర్కింగ్ టైటిల్) వంటి వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారీ బ్యూటీ. మంగళవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ‘కాంత’ సినిమా నుంచి భాగ్యశ్రీ లుక్‌ను విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపారు మేకర్స్. ఓ వింటేజ్ కారులో కూర్చుని మెరిసిపోతున్న ఆమె క్లాసిక్ లుక్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పోట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్నారు.