Director Bobby Kolli : ఆ విషయం మరోసారి రుజువైంది
ABN, Publish Date - Jan 13 , 2025 | 04:01 AM
బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘డాకు మహారాజ్’. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు.
- బాబీ కొల్లి
బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘డాకు మహారాజ్’. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఈ ఆదివారం విడుదలై హిట్ టాక్తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ ‘‘2023లో ‘వాల్తేరు వీరయ్య’తో విజయం దక్కింది. ఈ ఏడాది సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ విజయంతో ఈ పండగ మరింత ప్రత్యేకంగా మారింది. బాలకృష్ణ నటవిశ్వరూపం, బాబీ డియోల్ ప్రతినాయకత్వం ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి. మనసు పెట్టి సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు సినిమాను గుండెల్లో పెట్టుకుంటారని మరోసారి రుజువైంది’’ అని చెప్పారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి బ్లాక్బస్టర్ టాక్ వస్తోంది. సక్సెస్ వేడుకలు అనంతపురంలో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నాం’’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ విజయ్కార్తీక్, శ్రద్ధాశ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా తదితరులు పాల్గొన్నారు.