Balakrishna: ఇది దైవ నిర్ణయం.. నాన్న ఆశీర్వాదం

ABN , Publish Date - May 31 , 2025 | 04:52 AM

ఎన్టీఆర్‌ జాతీయ అవార్డ్‌ను తనయుడు బాలకృష్ణకు అందించనున్నట్లు కమిటీ ప్రకటించింది. ఈ అవార్డును అందుకోవడం తనకు అదృష్టంగా, దైవ నిర్ణయంగా భావిస్తున్నట్లు బాలకృష్ణ అన్నారు.

న్టీఆర్‌ జాతీయ అవార్డ్‌ను ఆయన తనయుడు బాలకృష్ణకు అందించనున్నట్లు అవార్డుల కమిటీ ప్రకటించింది. తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన అవార్డ్‌ను కొడుకు అందుకోవడం అరుదైన సంఘటనే. ఈ సందర్భంగా బాలకృష్ణ స్పందించారు. ఈ అవార్డ్‌ను అందుకోవడం అదృష్టంగా, దైవ నిర్ణయంగా, తండ్రి ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు పూర్తి చేసుకున్న అద్భుతమైన ఘడియలు ఒక వైపు, ఎన్టీఆర్‌ నట ప్రస్థాన 75 వసంతాల అమృతోత్సవాలు జరుగుతున్న శుభ ఘడియలు మరో వైపు, నటుడిగా నేను 50 ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న శుభ సందర్భం ఇంకో వైపు, కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మ భూషణ్‌తో సత్కరించిన తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాకు ‘ఎన్టీఆర్‌ జాతీయ అవార్డ్‌’ ప్రకటించడం నా అదృష్టం, దైవ నిర్ణయం, నాన్న ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, జ్యూరీ సభ్యులకు నా కృతజ్ఞతలు’ అని ఓ ప్రకటనలో బాలకృష్ణ పేర్కొన్నారు.

Updated Date - May 31 , 2025 | 07:02 AM