బలగం అంజన్న కన్నుమూత
ABN , Publish Date - May 26 , 2025 | 04:35 AM
బలగం సినిమాలోని అంజన్న పాత్రతో ప్రజల మనసులు గెలుచుకున్న నటుడు గుడిబోయిన బాబు అనారోగ్యంతో వరంగల్‌లోని సంరక్ష ఆస్పత్రిలో శనివారం రాత్రి...
బలగం సినిమాలోని అంజన్న పాత్రతో ప్రజల మనసులు గెలుచుకున్న నటుడు గుడిబోయిన బాబు అనారోగ్యంతో వరంగల్‌లోని సంరక్ష ఆస్పత్రిలో శనివారం రాత్రి ఒంటి గంటకు తుదిశ్వాస విడిచారు. రామన్నపేటలోని ఆయన నివాసంలో పలువురు నాటక, సినిమా, సాంస్కృతిక కళాకారులు, నాయకులు, స్థానికులు ఆదివారం నివాళులర్పించారు. కమెడియన్ యెల్డండి వేణు దర్శకుడిగా, దిల్ రాజు నిర్మించిన బలగం సినిమాలో హీరో ప్రియదర్శి తాతగా బాబు నటించి ఆకట్టుకున్నారు. కొంత కాలంగా కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ఆయన 20కు పైగా సినిమాల్లో నటించారు.
-వరంగల్, (ఆంధ్రజ్యోతి)